NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజా అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలి

1 min read

ప్రజా దరఖాస్తులు బియాండ్ ఎస్ఎల్ఎ వెళ్లకూడదు

పిజిఆర్ఎస్ కు 370 ప్రజా దరఖాస్తులు

జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్

నంద్యాల,  న్యూస్​ నేడు:ప్రజా పరిష్కార వేదిక ద్వారా స్వీకరించే ప్రతి అర్జీని నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డిఆర్ఓ రామునాయక్, పిజిఆర్ఎస్ నోడల్ ఆఫీసర్ ఉమామహేశ్వరి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను సత్వరమే నాణ్యతతో బియాండ్ ఎస్ఎల్ఎ వెళ్లకుండా ఎప్పటి కప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రీఓపెన్ అర్జీలకు సంబంధించి 5,367 రీఓపెన్ కావడం జరిగిందని అందులో 5,328 పరిష్కారం కాగా ఇంకా 39 పెండింగ్ లో ఉన్నాయని వాటిని త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా అధికారుల లాగిన్ లో ఎట్ టు వ్యూ అనే పెండింగ్ ఉండకూడదని పలుమార్లు ఆదేశించినప్పటికీ 563 అర్జీలు ఇంకా అధికారులు చూడాల్సి ఉందన్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన రీఓపెన్ అర్జీలలో ఇంకా 2 పెండింగ్ లో ఉన్నాయని వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించి పరిష్కారం దిశగా కృషి చేయాలన్నారు.

రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 198 అర్జీల స్వీకరణ

భూ సమస్యలను సమగ్రంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. ఈ క్లినిక్స్ ద్వారా భూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా పరిష్కరించే అవకాశం ఉందన్నారు. రెవెన్యూ క్లినిక్స్ ద్వారా మొత్తంగా 198 దరఖాస్తులు స్వీకరించగా వాటిలో రెవెన్యూ, గ్రామ/వార్డు సచివాలయ సేవలకు సంబంధించినవి 6, అడంగల్ సవరణలకు సంబంధించినవి 33, చుక్కల భూముల క్రమబద్ధీకరణ, 22-ఎ భూములకు సంబంధించినవి 17, అసైన్డ్ భూములు, భూ ఆక్రమణలకు సంబంధించినవి 40, రెవెన్యూ కోర్టు విచారణలు/ఆర్‌ఓఆర్‌కు సంబంధించినవి 46, సర్వే, రీ-సర్వేలకు సంబంధించినవి 45, దేవాదాయ, వక్ఫ్ భూములకు సంబంధించినవి 11గా ఉన్నాయని జాయింట్ కలెక్టర్ వివరించారు.

About Author