మండల టాపర్ రాగనిత్యకు షైనింగ్ స్టార్ అవార్డు
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ ఆదేశాల మేరకు నంద్యాలలోని ఏఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ 2025–26 కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఏనుగుమర్రి విద్యార్థిని పి. రాగనిత్య (మండల టాపర్ – 587 మార్కులు) ప్రతిష్టాత్మక షైనింగ్ స్టార్ అవార్డును అందుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్, ఎమ్మెల్సీ రంగోపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి, డీఈఓ జనార్దన్ రెడ్డిల చేతుల మీదుగా రాగనిత్యకు అవార్డు ప్రదానం చేశారు.అవార్డుతో పాటు విద్యార్థినికి ప్రోత్సాహకంగా రూ.20,000 నగదు బహుమతి, మెడల్ మరియు ప్రశంసా పత్రంను అందజేశారు.ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న షైనింగ్ స్టార్ అవార్డు విద్యార్థులకు గుర్తింపు, ప్రోత్సాహాన్ని అందించడమే కాకుండా మరింత ఉన్నత లక్ష్యాలను సాధించేలా స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే పట్టుదలతో మరింతగా రాణించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.రాగనిత్య షైనింగ్ స్టార్ అవార్డు అందుకోవడం పట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఏనుగుమర్రి ప్రధానోపాధ్యాయులు యు.ఎం. రాజశేఖర్ మరియు ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థినిని అభినందించారు.


