NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పల్లకీ ఉత్సవం..

1 min read

శ్రీశైలం, న్యూస్​ నేడు:  లోకకల్యాణంకోసం దేవస్థానం ఈ రోజు (14.12. 2025) రాత్రి శ్రీ స్వామిఅమ్మవార్లకు పల్లకీ ఉత్సవం నిర్వహిస్తుంది. ఈ పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి మరియు మూలా నక్షత్రం రోజులలో దేవస్థాన సేవగా (సర్కారి సేవగా) జరిపించబడుతుంది.ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా అమ్మవారి ఆలయ ఆశీర్వచన మండపంలో  లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవాసంకల్పాన్ని పఠిస్తారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపించబడుతుంది.అనంతరం శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో వేంచేబు చేయించి శాస్త్రోక్తంగా షోడశోపచారపూజలు జరిపించబడ్డాయి. ( కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు)శ్రీశైలదేవస్థానం వారి ద్వారా జారీ.

About Author