NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్‌ – వాష్‌ అండ్‌ గో’ కార్యక్రమం

1 min read

కర్నూలు, న్యూస్ నేడు:  కర్నూలు జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్ ఐపియస్  ఆదేశాల మేరకు  రాత్రి, తెల్లవారుజామున తిరిగే వాహనాలలో సరైన భద్రతా చర్యలు ,  జాగ్రత్తలు  పాటించాలని  కర్నూల్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.వాహనాలకు సంబంధించిన పత్రాలు, డ్రైవర్‌ల లైసెన్సుల వంటి భద్రతా ప్రమాణాలను పరిశీలిస్తున్నారు.రోడ్డు ప్రమాదాల నివారణకు అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు  కర్నూలు  పోలీసులు  భారీ  వాహానాలకు “స్టాప్‌ – వాష్‌ అండ్‌ గో” కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జిల్లా లో ఆదోని, పత్తికోండ, ఎమ్మిగనూరు, కర్నూలు సబ్ డివిజన్ లలో  హైదరాబాద్- బెంగుళూరు, హైదరాబాద్ – చైన్నె  ల నేషనల్ హైవే – 40, నేషనల్ హైవే – 44 ల లో లారీలు, ప్రవేట్ ట్రావెలింగ్ బస్సులు, ఆర్టీసి బస్సులు , కార్లు, మినీ వ్యాన్లు, లగేజీ బొలేరోలను పోలీసులు ఆపి ఆ డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించి పంపిస్తున్నారు.వాహనాలను అతి వేగంతో నడపకుండా, రాంగ్ రూట్ లో వెళ్ళకుండా, పరిమితికి మించి ప్రయాణీకులకు ఎక్కించుకునే డ్రైవర్లపై చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు  తెలియజేశారు.

About Author