అభ్యుదయ సాహితీ సదస్సును జయప్రదం చేయండి
1 min read
అభ్యుదయ రచయితల సంఘం( అరసం) జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సత్యనారాయణ పిలుపు
పత్తికొండ, న్యూస్ నేడు: కేంద్ర సాహిత్య అకాడమీ మరియు అభ్యుదయ రచయితల సంఘం (అరసం)సంయుక్తంగా” 90 ఏళ్ల తెలుగు అభ్యుదయ సాహిత్యం “అంశంపై సాహితీ సదస్సు డిసెంబర్ 21వ తేదీన ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు రెండు వేదికలుగా నిర్వహించడం జరుగుతుందని, ఈ సదస్సులు సాహితి పెరిగేలందరూ జయప్రదం చేయాలని అరసం జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సత్యనారాయణ కోరారు. ఈ సందర్భంగా సదస్సు యొక్క ఆహ్వాన పత్రాలను బుధవారం విడుదల చేశారు .డాక్టర్ లక్ష్మణ స్వామి అధ్యక్షతన స్థానిక శాంతి టాలెంట్ స్కూల్లో జరిగిన ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, సదస్సు వివరాలను వెల్లడిస్తూ సదస్సును జయప్రదం చేయాలని సాహితీ ప్రియులకు, పాఠకులకు పిలుపునిచ్చారు .ఈ సదస్సులో జాతీయ అరసం అధ్యక్షులు పెనుగొండ లక్ష్మినారాయణ విశిష్ట అతిధులుగా ,అరసం రాష్ట్ర అధ్యక్షులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి, కేంద్ర సాహిత్య అకాడమీ సలహా మండలి సభ్యులు వల్లూరు శివప్రసాద్ పాల్గొంటారని అని తెలిపారు. ప్రధాన వక్తులుగా ఆచార్య ఎస్వీ సత్యనారాయణ ,ఆచార్య కరిమిండ్ల లావణ్య, కె.పి అశోక్ కుమార్, డాక్టర్ ఎం హరి కిషన్, డాక్టర్ వింధ్య వాసిని దేవి ,కింగార తాయప్ప(మోహన్)లు పాల్గొని అభ్యుదయ నాటకం, అభ్యుదయ నవల, అభ్యుదయ విమర్శ, అభ్యుదయ కవిత, అభ్యుదయ కథలపై వారు ప్రసంగిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో అరసం నాయకులు రామమోహన్ రెడ్డి, ప్రేమ్ చంద్, వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు.

