NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఫిబ్రవరి 5 న ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర మహాసభ జయప్రదం చేయండి

1 min read

ఏపీ జెఎసి అమరావతి  రాష్ట్ర మహా సభ కు స్వచ్ఛందంగా ఉద్యోగులు హాజరు కావాలని పిలుపు

ఉద్యోగుల ఐక్యతను చాటి చెప్పాలి బొప్పరాజు పలిశెట్టి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: విజయవాడ పట్టణం లోనితుమ్మలపల్లి కళాక్షేత్రం నందు ఫిబ్రవరి 5వ తేదీన  నిర్వహించబోతున్న రాష్ట్రమహా సభకు  రాష్ట్రములో గల 92 డిపార్టుమెంటు సంఘాలకు సంబందించిన సభ్యులు అందరు హాజకాబోతున్నారు. ఈ మహసభకు  సన్నాహకంగా విజయవాడ దగ్గరలోని జిల్లాల సమావేశాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా  రాష్ట్ర చైర్మన్  గురువారం సాయంత్రము స్థానిక రెవెన్యూ భవనము ఏలూరు లో ఇతర రాష్ట్ర నాయకులుతో కలసి జిల్లా స్థాయి సమావేశము నిర్వహించారు. ఈ సమావేశము ఏపి జేఏసి అమరావతి ఏలూరు జిల్లా ఛైర్మన్ కె. రమేష్ కుమార్ అద్యక్షతన నిర్వహించడము జరిగినది. ఈ సమావేశములో బొప్పరాజు వెంకటేశ్వర్లు  మాట్లాడుతూ ముఖ్యముగా ప్రభుత్వము అనుసరిస్తున్న విధానములు, ఇటీవల ముఖ్య మంత్రి  ఉద్యోగ సంఘములతో మనసు విప్పి మాట్లాడిన విషయములు అన్నియు తెలియజేసారు. అందులో భాగంగా, ముఖ్యమంత్రి ఇచ్చిన మాట మేరకు ఇప్పటికే ఆర్టి.సి ఉద్యోగులు వేలాది మందికి పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారని, అలాగే మహిళా ఉద్యోగినులకు చైల్డ్ కేర్ లీవ్ సర్వీస్ మొత్తంలో ఎప్పుడైనా వాడుకునేలా చారిత్రాత్మక ఉత్తర్వులు ఇటీవల జారీ చేశారని, వివిధ శాఖల్లో పనిచేసే అనేక మంది క్రింది స్థాయి ఉద్యోగుల పేర్లు (నామిన్క్లేచర్) కొంత కించపరిచే విధంగా ఉన్నందున అవన్నీ మార్పులు చేసేందుకు అన్ని శాఖాధిపతుల నుండి ప్రతిపాదనలు కోరుతున్నారని, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పూర్తి స్థాయిలో 60 రోజుల్లో వినియోగంలోకి తెచ్చేందుకు ఇప్పటికే మంత్రివర్యులు, ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులతో కూడిన రాష్ట్ర స్థాయి కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు ఇవ్వడం అందులో మన ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ మరియు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గా ఉన్న బొప్పరాజు ని కూడా ఒక మెంబర్ గా నియమించడం మన ఏపీ జేఏసీ అమరావతి కి సంతోషం అని, అలాగే గౌ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అధికారులు నాలుగు రోజుల క్రితం ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని ఆన్లైన్లో ఒకేసారి వచ్చేలా మరియు జీ.పి.యఫ్/ఏపీ జి.ఎల్.ఐ లోన్లు, విత్డ్రయల్స్ అన్ని ఆన్లైన్లోన్ సేవలు అందించాలని నిర్ణయిస్తూ త్వరలో ఉత్తర్వులు రాబోతున్నాయని ఇవన్నీ  ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం జరుగుతున్నాయని, ఆర్థిక పరమైన అంశాలపై కూడా రాబోయే రోజుల్లో సానుకూల నిర్ణయం తీసుకుంటారని నమ్మకం ఉందని తెలిపారు. గరికపాటి బ్రహ్మయ్య, రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం.సుమన్ , కాంట్రాక్ట్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులు.జ్యోతి, గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర నాయకురాలు.పెన్షన్ అస్సోసియేషన్, డ్రైవర్స్ అస్సోసియేషన్ మరియు ఇతర జేఏసీ సభ్య సంఘ నాయకులు పాల్గొన్నారు.

About Author