ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలుకు దళిత సేన నాయకులు విజ్ఞప్తి
1 min read

వినతి పత్రాన్ని అందజేసిన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జుజ్జువరపు రవి ప్రకాష్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ కార్యాలయం విజయవాడ లో రాష్ట్ర ఎస్సీ కమిషన్ సెక్రెటరీ ఎస్.చిన్న రాముడు ఐఏఎస్ ని దళితసేన నాయకులు కలిశారు. ఈ సందర్భంగా దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షులు జిజ్జువరపు రవి ప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి ఎస్సీ ఎస్టీలకు చట్టపరమైన రక్షణ కల్పించాలని అందుకు రాష్ట్ర డిజిపి మరియు జిల్లా ల ఎస్పీ ల వారికి తగు ఆదేశాలు ఇవ్వాలని ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని రవి ప్రకాష్ విజ్ఞప్తి చేసి వినతి పత్రాన్ని అందజేశారు. ఎస్సీ కమిషన్ సెక్రటరీ ని కలిసిన వారిలో రాష్ట్ర దళిత సేన ప్రధాన కార్యదర్శి కాకర్లమూడి వెంకటరావు, కృష్ణాజిల్లా దళిత సేన అధ్యక్షులు భూసే అనిల్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా దళిత సేన ఇంచార్జ్ కవిలికట్ల జోషి రత్నబాబు తదితరులు ఉన్నారు.

