NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

” బాల్య వివాహల అనర్థాలపై అవగాహన ”    

1 min read

కర్నూలు, న్యూస్ నేడు:  నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ అధికార సంస్థ కర్నూలు వారి సూచనల మేరకు  100 రోజుల బాల్య వివాహ రహిత భారత్ కార్యక్రమ ము లో భాగముగా  బాల్య వివాహ రహిత ఆంధ్ర ప్రదేశ్ కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ వాలంటీర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. 100 రోజుల బాల్య వివాహ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా శ్రీ శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో వెంకటరమణ కాలనీ నందు గల లైన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు మెల్విన్  జోన్స్ కార్యాలయం నందు  కెవిఆర్ కళాశాల విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు.  బాల్యవివాహాలను అరికట్టి భారతదేశ అభివృద్ధికి సహకరిద్దామని రాయపాటి శ్రీనివాస్ అన్నారు.   పిల్లలు తమ కాళ్ళపై తాము నిలబడాలంటే మంచి చదువులు చదవి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. చిన్న చిన్న అవసరాల కోసం, లేదా ఆనందం కోసం ప్రేమ  పేరుతో మోసపోవద్దని బాలికలను హెచ్చరించారు. కనీసం డిగ్రీ దాకా చదివి తమ భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లాలప్ప మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల తమ భవిష్యత్తు కాకుండా పిల్లల భవిష్యత్తు కూడా నాశనం అవుతుందన్నారు. 18 సంవత్సరాల లోపు పెళ్లి చేసుకుంటే బాలిక ఆరోగ్యం దెబ్బ తినడమే కాకుండా గర్భవతి అయితే గర్భంలోనే శిశు మరణించే అవకాశం ఉందన్నారు. ఒకవేళ జన్మించిన అంగవైకల్యం లేదా బుద్ధి మాంద్యంతో జన్మించే అవకాశం ఉందన్నారు. బాల్యవివాహాలు వ్యతిరేకించడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు. బాల్య వివాహాలు చేసుకుంటే ఎన్నో నష్టాలు ఉన్నాయని వివరించారు. అనంతరం పిల్లలచే బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కెవిఆర్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ చక్రపాణి రెడ్డి,లెక్చరర్స్ నాగిరెడ్డి, శివయ్య, జ్యోతి పాల్గొన్నారు.

About Author