NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అక్టోబరు మాసం జిల్లా పర్యటనలో  లేవనెత్తిన అంశాలుపై మంచి ప్రగతిని చూపాలి

1 min read

జాతీయ షెడ్యూలు తెగల కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్

గిరిజనులు సంక్షేమం,అభివృద్ధి, ఇతర సమస్యలుపై అలసత్వం, నిర్లక్ష్యం వహించే అధికార్లుపై చర్యలు తప్పవు

గిరిజన ప్రాంతాల్లో సంతృప్తిని చెందేలా సెల్ ఫోన్లు సిగ్నల్స్  ఉండేలా చూసి, అవసరమైన చోట్ల సెల్ టవర్సు ఏర్పాట్లు చెయ్యాలి

జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో మంగళవారం జాతీయ షెడ్యూల్డ్ తెగలు కమీషన్ సభ్యులు శ్రీ జాటోతు హుస్సేన్ అక్టోబరు మాసం జిల్లా పర్యటనలో  లేవనెత్తిన అంశాలుపై  సాధించిన ప్రగతి, గిరిజన ప్రాంతాలు అభివృద్ధి, సంక్షేమం, ఇతర సమస్యలుపై 17 శాఖలు అధికారులతో జిల్లా కలెక్టరు అధ్యక్షతన కె.వెట్రిసెల్వి సుదీర్ఘంగా సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జాతీయ షెడ్యూల్డ్ తెగల కమీషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ అక్టోబరు మాసంలో జిల్లా పర్యటనలో  లేవనెత్తిన అంశాలుపై నూటికి నూరుశాతం లక్ష్యాలను సాధించాలన్నారు. మోదెల గ్రామ గిరిజనులు మనోభావాలు అనుగుణంగా, వారి చిరకాల కోరిక ప్రకారం బుట్టాయిగూడెం మండలంలోకి  మోదెల గ్రామాన్ని కలుపుటకు తీర్మాన ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. రెడ్డిగూడెం, రాజానగరం, కోటరామచంద్రపురం సెల్ ఫోన్లు సిగ్నల్స్ లేవని ఎక్కువమంది ఫిర్యాదులు వస్తున్నాయని, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సెల్ టవర్స్ రిపేర్లు ఉంటే చేయించి, కొత్తగా అవసరమైన చోట సెల్ టవర్స్ ఏర్పాటు చెయ్యాలని ఆదేశించారు. గిరిజనులు సమస్యలు పరిష్కారానికి అధికారులు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి వెంటనే స్పందించాలని అన్నారు. ఐటిడిఏ పరిధిలో గిరిజనులు, గిరిజన సంఘాలు ప్రతినిధులు నుండి  వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసుకుని పరిష్కారం చూపాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, ఐటిడిఏ పివో కె.రాములు నాయక్, జెడ్పీ సిఈవో యం.శ్రీహరి, ఇరిగేషన్ యస్ఇ సి.హెచ్.దేవ ప్రకాష్, గిరిజన సంక్షేమశాఖ డిడి పి.జగన్నాధ రావు, ఏపివో ఇంచార్చి యం.శ్రీనివాస రావు, జిల్లా గృహనిర్మాణ శాఖ పిడి జి.సత్యనారాయణ, ఆర్ డబ్ల్యూ యస్ అధికారి జి.త్రినాథ బాబు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.పి.జె.అమృతం, జిల్లావ్యవసాయ శాఖ జెడి షేక్ హభీబ్ భాషా, జిల్లా నైపుణ్య అభివృద్ధిసంస్థ అధికారి యన్.జితేంద్ర, యల్డియం డి.నీలాద్రి, డిఆర్డిఏ ఆర్. విజయరాజు, డియఫ్ వో పి.వి.సందీప్, సిపివో సి.హెచ్. వాసుదేవ రావు, ఇరిగేషన్ ఇఇ యన్.సుజాత, జిల్లా టూరిజం మేనేజరు యస్.పట్టాభి రామన్న, సంబంధిత అధికారులు, బియస్ యన్ యల్ ప్రతినిధులు,  ఐటిడిఏ అధికారులు, ఇంజనీరింగు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

About Author