NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యువనేత  కేఎస్​ఎన్​ఆర్​ పుట్టినరోజున అభిమానులు పలు సేవా కార్యక్రమాలు..!

1 min read

పాణ్యం, న్యూస్​ నేడు:  పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కాక,కర్నూలు జిల్లా మరియు అనంతపురంలో యువనేత శ్రీ.కాటసాని శివ నరసింహ రెడ్డి  పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.వైయస్సార్సీపి నంద్యాల జిల్లా అధ్యక్షులు,పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి  తనయుడు యువనేత కాటసాని శివ నరసింహారెడ్డి  జన్మదినం సందర్భంగా కర్నూలు నగరంలో “అక్షయ శ్రీ పౌండేషన్” నాగార్జున ఆధ్వర్యంలో వృద్ధాశ్రమం మరియు రోడ్డు సైడ్ లో ఉన్న వారికి అన్నదానం చేయడం జరిగింది… అనంతరం అనంతపురంలో కాటసాని అభిమానులు అమర్నాథ్,సురేష్ రెడ్డి,రాజశేఖర్,చలపతి  అనంతపురం టౌన్ నందు యువ నేత కాటసాని శివ నరసింహారెడ్డి  జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించి,యువనేత కేఎస్​ఎన్​ఆర్​  కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

About Author