నవోదయం 2.0 పై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: నాటు సారాయి తయారీ లేదా అమ్మకాలను మానివేసిన వారి కొరకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పన నిమిత్తం గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి డాక్టర్ ఏ సిరి ఆదేశాల మేరకు నేడు జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి వారి కార్యాలయంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది. సారాయి తయారీని మానివేసి ప్రత్యామ్నాయజీవనోపాధి నిమిత్తం ముందుకు వచ్చిన 246 మంది పాత నేరస్తులు కు అర్హత గల రుణాలు మరియు సబ్సిడీ రుణాలు మరియు వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ అవకాశాల గురించి ఈ సమావేశంలో క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. ఇప్పటికే నాటు సారాయి తయారీకి దూరంగా ఉన్న పదిమంది బంగారు పేట వాస్తవ్యులకు 20 లక్షల రూపాయలు రుణం మంజూరు చేయడంతో మిగతా నేరస్తులు కూడా నాటు సారాయి తయారీని మానివేసి ఇతర ఉపాధి నిమిత్తం ముందుకు రావడంతోఈ సమావేశంలో వివిధ అవకాశాల గురించి విస్తృతంగా చర్చించడం జరిగింది. ఈ సమావేశం ను ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీ హనుమంతరావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఎం సుధీర్ బాబు , మెప్మా పీడీ శ్రీనివాసులు, డిఆర్డిఏ పిడి వెంకట రమణరెడ్డి , ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి తులసీదేవి, ఎస్టీ కార్పొరేషన్ ఈడి శ్రీ జాకీర్ హుస్సేన్, ఎస్టీ కార్పొరేషన్ ఈడి శ్రీ సురేష్, మరియు ఏ ఈ ఎస్ లు రాజశేఖర్ గౌడ్, రామకృష్ణారెడ్డి ఎక్సైజ్ సీఐలు చంద్రహాస్, సువర్ణలత, లలితాదేవి మరియు మంజుల పాల్గొన్నారు.

