గుంతకల్లు చేరిన ఓయాసిస్ జనని యాత్ర
1 min read

సమాజంలో ఫెర్టిలిటీ అవగాహన పెంపొందించడానికి మరో ముందడుగు
ఉచిత కన్సల్టేషన్లు, ఉచిత ఫెర్టిలిటీ పరీక్షలు, శాస్త్రాధారిత మార్గదర్శకాన్ని నేరుగా ప్రజలకు అందించే దేశవ్యాప్త ఉద్యమం
కర్నూలు, న్యూస్ నేడు: భారతదేశంలో అత్యంత విశ్వసనీయ రీప్రొడక్టివ్ మెడిసిన్ సంస్థల్లో ఒకటైన ఓయాసిస్ ఫెర్టిలిటీ, దేశవ్యాప్తంగా ఫెర్టిలిటీ అవగాహన పెంచే లక్ష్యంతో చేపట్టిన ఓయాసిస్ జనని యాత్ర గుంతకల్లు చేరింది. టైర్ I,II,III ప్రాంతాల్లో ఫెర్టిలిటీ అవగాహన, నిపుణుల మార్గదర్శకం, ఫెర్టిలిటీ స్క్రీనింగ్ సేవలను నేరుగా ప్రజలకు అందించడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసన సభ సభ్యులు, గుమ్మనూరు జయరాం , గుమ్మనూరు ఈశ్వర్ , శ్రీ శ్రీనివాసులు నారాయణ స్వామి హాజరై, ఫెర్టిలిటీ అవగాహనను కుటుంబాలకు దగ్గర చేస్తూ, సమాజ స్థాయి ఆరోగ్య చైతన్యాన్ని బలోపేతం చేస్తున్న ఓయాసిస్ ఫెర్టిలిటీ ప్రయత్నాలను అభినందించారు. జీవనశైలి మార్పులు, ఆలస్య వివాహాలు, శాస్త్రీయ అవగాహన లోపం వంటి కారణాలతో ఫెర్టిలిటీ సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో, ఓయాసిస్ జనని యాత్ర బస్సు దంపతులకు ఉచిత ఫెర్టిలిటీ సంప్రదింపులు, ఉచిత ఎ ఎం హెచ్ పరీక్ష, ఉచిత వీర్య పరీక్ష, ఉచిత హీమోగ్లోబిన్ పరీక్షలు వంటి సేవలను అందిస్తోంది. శుభ్రమైన, సురక్షితమైన నమూనా సేకరణ ప్రాంతాలతో ఈ సేవలు మరింత సౌకర్యవంతంగా అందించబడుతున్నాయి.ఒయాసిస్ ఫర్టిలిటీ గురించి:2009లో స్థాపించబడిన ఓయాసిస్ ఫెర్టిలిటీ, భారతదేశవ్యాప్తంగా 34 కేంద్రాలతో అగ్రగామి రీప్రొడక్టివ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్. శాస్త్రీయ నైపుణ్యం, నైతిక వైద్యపద్ధతులు, అత్యున్నత IVF విజయశాతాలతో ప్రసిద్ధి చెందిన ఓయాసిస్, ఇన్నాళ్లుగా అనేక కుటుంబాలకు ఆరోగ్యకరమైన బిడ్డలను అందించింది. పురుషులు మరియు మహిళల కోసం IVF, IUI, ICSI, ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్ వంటి విస్తృత సేవలను ఆధునిక ల్యాబ్ టెక్నాలజీ, వ్యక్తిగత సంరక్షణ, సంపూర్ణ వెల్నెస్ సహకారంతో అందిస్తోంది.


