NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

2029 నాటికి అర్హత ఉన్న ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలన్నదే ప్రధాన లక్ష్యం

1 min read

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మెరిట్ సీట్లు లేకుండా చేసింది గత పాలకులే?

గత ప్రభుత్వం రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసింది

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పై 18 నెలల కాలంలో దాదాపు రూ. 50 వేల కోట్లు ఖర్చు

ఒక్కో ఇటుక పేర్చి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పెడుతున్నాం

అర్హులైన అందరికీ అక్రడిటేషన్ అందిస్తాం 

సమచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి

విజయవాడ, న్యూస్​ నేడు:  ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నంబర్ వన్ స్టేట్‌గా నిలబెట్టాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేస్తోందని సమచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.. స్థానిక ప్రెస్ క్లబ్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మంగళవారం సమచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు.. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, గత ప్రభుత్వ వైఫల్యాల గురించి మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ పీపీపీ అనేది కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టింది కాదని, ఇదిప్రపంచవ్యాప్తంగానే కాకుండా దేశంలోని అనేక రాష్ట్రాల్లో విజయవంతంగా కొనసాగుతున్న విధానంగా మంత్రి అన్నారు. మెడికల్ కాలేజీల విషయంలో పీపీపీ మోడల్‌ను విమర్శించడం సరికాదు. గత ప్రభుత్వం 17 కాలేజీలు తెచ్చామని గొప్పలు చెప్పుకుందని కానీ, కేవలం దాదాపు రూ. 600 కోట్లు ఖర్చు చేసి 8,500 కోట్ల ప్రాజెక్టును గాలికి వదిలేసిందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చిన పీపీపీ విధానం వల్ల 50% సీట్లు మెరిట్ ప్రాతిపదికన కేవలం రూ. 15,500 ఫీజుతో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకే దక్కుతాయన్నారు. గత ప్రభుత్వ విధానం వల్ల కేవలం 35% సీట్లు మాత్రమే మన విద్యార్థులకు అందేవని, ఈ మార్పు వల్ల కలిగే ప్రయోజనాన్ని విపక్షం జీర్ణించుకోలేకపోతుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. సోషల్ మీడియా, యూట్యూబర్లకు కూడా అక్రిడిటేషన్ ఇచ్చే అంశంపై అధ్యయనం చేయడానికి ఒక కమిటీని వేశారన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరియు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని, అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సానుకూలంగా ఉన్నారని మంత్రి కొలుసు పార్థసారధి తెలియజేశారు.కార్యక్రమంలో సీఆర్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్, ఏపీయూడబ్లూజే, ఐజేయూ నాయకులు ఐవీ సుబ్బారావు, కంచల జయరాజు,  సోమ సుందర్, చావా రవి, వెంకటేశ్వర్లు, దారం వెంకటేశ్వరరావు,  దాసరి నాగరాజు,  ఏచూరి శివ, ఇతర నాయకులు పాల్గొన్నారు.

About Author