NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టిడిపి పార్లమెంటరీ కమిటీలో స్థానం

1 min read

మహానంది, న్యూస్​ నేడు:  మహానంది మండలం తమ్మడపల్లె గ్రామానికి చెందిన   శ్యామల జనార్దన్ రెడ్డి ని శ్రీశైలం నియోజకవర్గం పార్లమెంటరీ కమిటీ వైస్ ప్రెసిడెంట్గా నియమించారు. ఈయనతో పాటు వైస్ ప్రెసిడెంట్ గా బండి ఆత్మకూరు మండలం చెందిన కంచర్ల సురేష్ రెడ్డి కి స్థానం కల్పించింది. జిల్లా పార్లమెంటరీ కమిటీ అధ్యక్షురాలుగా నంద్యాల నియోజకవర్గం నుండి గౌరు చరిత రెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ గా ఎన్ఎండి ఫిరోజ్ తో పాటు 9 మంది వైస్ ప్రెసిడెంట్ గా మరో 9 మందిని ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా పార్టీ ప్రకటించింది. వీరిలో నంద్యాల, శ్రీశైలం ,ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్, నందికొట్కూరు, పాణ్యం తదితర నియోజకవర్గం నకు చెందిన వారికి పార్టీ పదవులను కట్టబెట్టింది. పార్లమెంటరీ కమిటీలో కీలక స్థానంలో పదవి అప్పగించినందుకు శ్యామల జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.

About Author