NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు జిల్లా పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా బి. అబ్దుల్ సుబాన్

1 min read

హోళగుంద న్యూస్ నేడు: కర్నూలు జిల్లా పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా హోళగుంద మండల సీనియర్ నాయకులు బి అబ్దుల్ సుబాన్ నియమితులయ్యారు. టిడిపి సీనియర్ నాయకులు బి అబ్దుల్ సుభాన్ ఎన్నో ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ కోసం పని చేస్తూ, రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూ, మచ్చలేని నాయకుడిగా ప్రజల మన్ననలు పొందుతున్నారు.అపార సేవా భావం కలిగిన టిడిపి సీనియర్ నాయకులు బి అబ్దుల్ సుబాన్ ఎంతోమందికి సాయం చేస్తూ, ఎన్నో సేవలు చేస్తూ, తను చేసిన సాయం పబ్లిసిటీకి కాకుండా పబ్లిక్ కు ఉపయోగపడే విధంగా తనదైన శైలిలో వ్యవహరిస్తూ,మంచి వ్యక్తిత్వం గలవారీగా  కులమతాలతీతంగా మండల ప్రజలందరూ అభిమానించే నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు.పదవులు ఆశించకుండా తన అనుచరగణంతో పాటు మండలంలోని టిడిపి కోసం పనిచేసే ప్రతి యువకునికి ప్రాధాన్యత ఇస్తూ టిడిపి పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న  బి అబ్దుల్ సుబాన్ కు నేడు కర్నూలు జిల్లా పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమితులైన సందర్భంగా మండలంలోని టిడిపి నాయకులతోపాటు ప్రజలు బి అబ్దుల్ సుబాన్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నేడు ఆయన సేవలను గుర్తించి కర్నూలు జిల్లా పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించిన ఆలూరు టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం శివప్రసాద్, సహకరించిన మండల నాయకులకు కార్యకర్తలకు బి.అబ్దుల్ సుభాన్ ధన్యవాదాలు తెలిపారు.

About Author