క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకున్న క్రైస్తవులు
1 min read

ఫాదర్ మధుబాబు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పూజలు..
మిడుతూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని వివిధ గ్రామాల్లో క్రిస్మస్ పండుగను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. అర్ధరాత్రి నుండి గురువారం రాత్రి దాకా గ్రామాల్లో ప్రత్యేకంగా ఏసు క్రీస్తు జన్మదిన సందర్భంగా ప్రార్థనలు నిర్వహించారు.ఉప్పలదడియ ఆర్ సీఎం విచారణ గురువులు డి మధుబాబు ఆధ్వర్యంలో విచారణ పరిధిలో ఉన్న ఉప్పలదడియ, కడుమూరు,49 బన్నూరు, దేవనూరు,పైపాలెం, దిగువపాడు,చౌటుకూరు, కేతవరం గ్రామాల్లో అర్ధరాత్రి నుండి దివ్య బలి పూజను సమర్పిస్తూ ఏసుక్రీస్తు పుట్టుక గురించి గురువులు మధుబాబు వాక్య సందేశం ఇచ్చారు.అనంతరం క్రైస్తవులకు దివ్య సత్ప్రసాద అప్పమును అందజేశారు. గ్రామాల్లో సంగస్తులు గురువారం తెల్లవారుజామున టపాకాయలు కలుస్తూ సంబరాలు చేసుకుంటూ బాల యేసును భక్తిశ్రద్ధల నడుమ ఊరేగింపు చేశారు.ఆటల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో సహాయ గురువు థోమాస్, సిస్టర్ సహాయరాణి మరియు సంఘస్తులు పాల్గొన్నారు.


