విద్యతోనే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు
1 min read

ఉషోదయ గ్రామీణ అభివృద్ధి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సిహెచ్ నాగరాజు.
హోళగుందన్యూస్ నేడు: విద్యార్థి దశ నుండి విద్యార్థిని, విద్యార్థులు పట్టుదలతో విద్యను అభ్యసిస్తే ఉన్నత శిఖరాలను చేరుకుంటారని ఉషోదయ గ్రామీణ అభివృద్ధి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సిహెచ్ నాగరాజు అన్నారు గురువారం స్థానిక సీజనల్ హాస్టల్లో , ఈనెల డిసెంబర్ 22న శ్రీనివాస్ రామానుజన్ జయంతి సందర్భంగా గణిత శాస్త్ర సబ్జెక్టుకు సంబంధించి ఉపాధ్యాయులు పోటీ పరీక్షలు నిర్వహించారు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పోటీ పరీక్షలు పట్టుదలను పెంచడం కాకుండా తప్పు ఒప్పులని తెలుసుకుని ముందుకు వెళ్లడానికి వీలవుతుందన్నారు విద్యార్థి దశ నుండి క్రమశిక్షణను అలవర్చుకొని కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే సాధ్యం కానిది అంటూ చదువుల్లో ఏది ఉండదన్నారు మనకు ఏదైనా అర్థం కాకపోతే ఎవరేమనుకున్నా పర్వాలేదు మౌనంగా ఉండకుండా ఉపాధ్యాయులతో చెప్పించుకోవాలన్నారు, వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సోహెబ్, దుర్గయ్య, సీజనల్ హాస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


