18వ అఖిలభారత మహాసభలను జయప్రదం చేయాలి :సిఐటియు పిలుపు
1 min read

డోన్ , న్యూస్ నేడు: సిఐటియు 18వ అఖిల భారత మహాసభల సందర్భంగా మహాసభలను జయప్రదం చేయాలని నంద్యాల జిల్లాలో మూడు ప్రాంతాల నుండి ప్రజా చైతన్య జాతాలు ప్రారంభం అయ్యాయి.డోన్ పట్టణం నుండి బయలుదేరుతున్న 3వ జాతాను సీనియర్ నాయకులు జి.కొండయ్య ఆదివారం బేతంచెర్ల సర్కిల్ సిఐటియు కార్యాలయం దగ్గర సిఐటియు జెండాను ఊపి జాతాను ప్రారంభించారు.కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వై.ఎల్లయ్య, జిల్లా సహాయ కార్యదర్శి టి.శివరాం,సీనియర్ నాయకులు పి.రామాంజనేయులు,మండల కన్వీనర్ ఎవి. భాస్కర్ రెడ్డి,కో కన్వీనర్ బి.నాగమద్దయ్య పట్టణ ఉపాధ్యక్షులు నక్కీ శ్రీకాంత్ మాట్లాడుతూ సిఐటియు 18 వ అఖిలభారత మహాసభలు డిసెంబర్ 31 నుండి 2026 జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో జరుగుతున్నాయని జనవరి 4వ తేదీన విశాఖపట్నం ఆర్కే బీచ్ లో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించబడుతుందని ఈ మహాసభల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక కర్షక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చిస్తారని దేశ సంపదను కార్పోరేట్ల పరం చేస్తూ పని గంటల పెంపు బ్రిటిష్ కాలం నుండి కార్మికులు పోరాడి ప్రాణ త్యాగాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాల రద్దు విశాఖ ఉక్కు తో సహా ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ రైతులకు కనీస మద్దతు ధర ఉపాధి చట్టం తదితర సమస్యలపై చర్చ జరుగుతుందని దేశ సంపదను ఉద్యోగ కార్మిక హక్కులను కాపాడుకోవడానికి సిఐటియు మహాసభలలో చర్చించుకుని భవిష్యత్తు పోరాట కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుందన్నారు. ఉద్యోగులు కార్మికులు కర్షకులు మేధావులు యువకులు పాల్గొని జనవరి 4న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు.అనంతరం ప్రచార జాత ప్యాపిలి మండలానికి బయలుదేరి వెళ్ళింది.ఈ కార్యక్రమంజలో నాయకులు బాబయ్య ఎర్రన్న రామబుగ్గడు రామాంజి బాబు బాలు సుబ్బయ్య తిరుపాలు జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

