నిస్వార్ధ ఫౌండేషన్ నిరుపేదలకు అప్పన్న హస్తం అందిస్తోంది
1 min read

నిస్వార్ధంగా ఉమ్మడి జిల్లాలలో విస్తృతంగా సేవలు
ఘనంగా 8వ వార్షికోత్సవ వేడుకలు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు నగరంలోని నిస్వార్థ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఆపన్న హస్తం అందిస్తూ నిస్వార్థంగా సేవలు అందిస్తున్నామని నిస్వార్ధ ఫౌండేషన్ అధినేత ప్రశాంత్ తెలిపారు. ఫౌండేషన్ ఏర్పడి ఎనిమిదో సంవత్సరంలోకి అడుగుపెట్టే సందర్భంగా ఈరోజు నగరంలోని లేడీస్ క్లబ్ లో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నిస్వార్థ ఫౌండేషన్ ద్వారా విశిష్ట సేవలు అందించిన పలువురు ప్రముఖులను ఫౌండేషన్ వ్యవస్థాపకులు పలువురిని శాలువాలు కప్పి, పూల బొకేలు అందించి ఘనంగా సత్కరించి మెమెంటోలు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు సభికులందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఫౌండేషన్ అధినేత ప్రశాంత్ మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో ఉన్న దివ్యాంగులు , ప్రమాదంలో గాయపడిన బాధితులకు అదే విధంగా వివిధ రకాలుగా అనారోగ్యానికి గురైన నిరుపేదలందరికీ తమ వంతుగా సేవలందిస్తున్నామని తెలిపారు. ఎనిమిదో సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా లక్ష మొక్కలు నాటే ప్రణాళిక లో భాగంగా బృందావనం అనే కార్యక్రమం కూడా చేపట్టినట్లు తెలిపారు. తనతోపాటు నిస్వార్ధంగా పగలనకా రాత్రనక కష్టపడి పనిచేస్తున్న తన సభ్యులందరికీ సహాయ సహకారాలు అందిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు.


