కొల్లుబోయిన శ్రీనివాస్ యాదవ్, దాలిపర్తి లక్ష్మి లకు ప్రత్యేక అభినందనలు
1 min read

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్
వాడపల్లి, న్యూస్ నేడు: ఏడువారాల వెంకటేశ్వర స్వామి వారిగా గుర్తింపు పొందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి ట్రస్ట్ బోర్డు సభ్యులుగా సోమవారం నాడు ప్రమాణ స్వీకారం చేసిన కొల్లుబోయిన శ్రీనివాస్ యాదవ్ దాలిపర్తి లక్ష్మిలకు ప్రత్యేక అభినందనలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివ రామ ప్రసాద్ గౌడ్. ఈ సందర్భంగా శివరామ ప్రసాద్ నా మిత్రులు తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో పనిచేసి టిడిపి జాతీయ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మన్ననలతో యువ నేత జాతీయ ప్రధాన కార్యదర్శి మాన్యశ్రీ నారా లోకేష్ ఆశీస్సులతో మిత్రులు కొల్లు బోయిన శ్రీనివాస్ యాదవ్ కి మరియు పామర్రు నియోజకవర్గ పామర్రు మండల వాస్తవ్యులు దాలిపర్తి లక్ష్మీకి ఇరువురి డైరెక్టర్లకు శాలువా కప్పి పూల బొకే ఇచ్చి వెంకటేశ్వర స్వామి వారి ఫోటో బహుకరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి తమ సంతోషాన్ని వ్యక్తపరిచినారు.


