ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడాలి
1 min read

నూరుశాతం ఉతీర్ణత శాతం సాదించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో ‘100 రోజుల ప్రణాళిక’ అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల స్థాయి మెరుగుపరిచి, నూరుశాతం ఉతీర్ణత సాదించేందుకు రూపొందించిన ‘100 రోజుల ప్రణాళిక’ అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో సోమవారం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ‘100 రోజుల ప్రణాళిక’ అమలుపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ‘100 రోజుల ప్రణాళిక’ కార్యక్రమంలో భాగస్వాములై, జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నూరు శాతం ఉతీర్ణత సాధన దిశగా చేపట్టిన ‘100 రోజుల ప్రణాళిక’ విజయవంతంగా అమలు చేసి విద్యాభివృద్ధిలో ఏలూరు జిల్లాను ముందు వరస లో నిలిపి ఉత్తమ ఫలితాలు సాధనకు కృషిచేసిన వారిని సన్మానించి గౌరవిస్తామని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో డిఈఓ వెంకటలక్ష్మమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

