ముక్కోటి వైభవం…
1 min read

శ్రీ వేంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న భక్తులు
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు నగరం పవిత్ర తుంగభద్ర నది తీరం నందు వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు భవాని సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం హరిహర క్షేత్రం సంకల్ బాగ్ నందు మంగళవారం ముక్కోటి ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడంతో భక్తులు ఉదయం 3 గంటలకే స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. 4 గంటల నుంచి ఉత్తర ద్వారా దర్శనం ప్రారంభించారు. ఉదయం నుంచి అశేషంగా జనవాహిని తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకుంది అందరికి కూడా తీర్థ ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే దాదాపు 22,000 జనం వచ్చారు ఇంకా ఉన్నారు ఈ కార్యక్రమం అంతా కర్నూల్ నగర బ్రాహ్మణ సంఘం మరియు ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా కలిసి కృషి చేసి దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అని అధ్యక్షులు సండే చంద్రశేఖర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు కోర్ కమిటీ సభ్యులు శ్రీ సి వి దుర్గాప్రసాద్ గారు చల్లా నాగరాజ్ శర్మ గారు శ్యాంసుందర్ గారు నాగులవరం రాజశేఖర్ గారు సిఎస్ ప్రసాద్ రావు గారు టీవీ రవిచంద్ర శర్మ గారు శ్రీనివాసరాజు గారు శివ అన్నగారు మరియు ఆలయ కమిటీ సభ్యులు కార్యకర్తలు శ్రీవారి సేవకులు అందరు కూడా పాల్గొన్నారు.

