యోగక్షేమాలు తెలుసుకుంటూ ఎమ్మెల్యే పింఛన్ల పంపిణీ
1 min read

పింఛన్ల పంపిణీలో మొదటి స్థానంలో మిడుతూర్.
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేస్తుండగా వారి యోగక్షేమాలను మరియు కుటుంబ స్థితిగతులను తెలుసుకుంటూ పింఛన్లను పంపిణీ చేస్తూ నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ముందుకు వెళ్లారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని నాగలూటి గ్రామంలో బుధవారం ఉ10 గం.కు గ్రామ టీడీపీ నాయకులు సంపంగి రవీంద్ర బాబు,రమణారెడ్డి ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు.ఈరోజు ఒకటవ తేదీన పంపిణీ చేయాల్సిన పింఛన్లను ఒకరోజు ముందుగానే నిన్న గ్రామంలో ఉన్న వృద్ధులు, వితంతువులు,ఒంటరి మహిళలు,వికలాంగుల ఇంటికి వెళ్లి పింఛన్ నగదును ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు.ఒకరోజు ముందుగానే పింఛన్ అందజేస్తూ ఉండడంతో లబ్ధిదారుల్లో ఆనందం వెళ్ళు విరిసింది.ప్రజా సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రభుత్వ పనితీరు వంటి అంశాలపై నేరుగా ప్రజల అభిప్రాయాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.దేశంలో ఎక్కడా లేనివిధంగా పింఛన్ల పంపిణీ చేస్తున్నామని ఇప్పటి వరకు 50 వేల కోట్లకు పైగా పెన్షన్ల కోసం ఖర్చు చేశామని ఎమ్మెల్యే అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న మార్కెట్ యార్డ్ డైరెక్టర్ జనసేన సంపత్ కుమార్ ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే పరామర్శించారు.పింఛన్ల పంపిణీలో జిల్లాలో మిడుతూరు మండలంలో 5,256 కు గాను 4,995 పింఛన్లు 95 శాతం పంపిణీ చేసి జిల్లాలో మొదటి స్థానంలో ఉందని ఎంపీడీవో దశరథ రామయ్య తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కాత రమేష్ రెడ్డి, తహసిల్దార్ శ్రీనివాసులు, ఎంఏఓ పీరు నాయక్,బాబుసాహెబ్,వెంకటేశ్వర్ రెడ్డి,జయరాముడు,మహేశ్వర్ రెడ్డి,కమతం రాజశేఖర్ రెడ్డి బ్రాహ్మణకొట్కూర్ ఎస్సై మణికంఠ తదితరులు పాల్గొన్నారు.


