NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సాయి స్పోర్ట్స్ కేంద్రాన్ని తరలించవద్దు

1 min read

కర్నూలు స్పోర్ట్స్ న్యూస్​ నేడు:   శాయి స్పోర్ట్స్ హాస్టల్ ను తిరుపతికి తరలించే ప్రయత్నం రాష్ట్ర క్రీడా శాఖ అధికారులు విరమించుకోవాలని జిల్లా క్రీడా సంఘాల జేఏసీ కన్వీనర్  కె .నాగరత్నమయ్య జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరిని సోమవారం కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా నాగరత్నమయ్య మాట్లాడుతూ  స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయి) ట్రైనింగ్ సెంటర్ ను కర్నూల్ లోనే కోనసాగించాలని భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని పేరుతో తిరుపతికి తరలించేందుకు అధికారులు కుమ్మకై కుట్ర  చేస్తున్నార ని ఆయన ఆరోపించారు. కర్నూల్ అవుట్డోర్ స్టేడియంలో ఉన్న కొత్త భవనాలను ప్రత్యాయమంగా ఉపయోగించుకునేలా చూడాలని కలెక్టర్కు విన్నవించరూ. పది రోజుల్లోగా కర్నూలు  అవుట్డోర్ స్టేడియంలోనే సాయి సెంటర్ ను కొనసాగేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. స్టేడియం లో ఉన్న అదనపు గదులను శాయి హాస్టల్ నిర్వహణకు ఇవ్వాలని  ఇంచార్జి డిఎస్డివో భూపతిరావు కు ఫోన్ ద్వారా కలెక్టర్ ఆదేశలు జారీ చేసినట్టు తెలిపారు.

About Author