అక్రమంగా పెట్రోలియం రవాణా కాకుండా ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ఏర్పాటు
1 min read
జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్
కర్నూలు, న్యూస్ నేడు: సరిహద్దు రాష్ట్రాల నుండి జిల్లాలోకి అక్రమంగా పెట్రోలియం రవాణా కాకుండా కట్టడి చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తెలిపారు.మంగళవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో అక్రమ పెట్రోలియం రవాణా పై ఎన్ఫోర్స్మెంట్ ప్రొటెక్షన్ కమిటీతో జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ కర్ణాటక నుండి ఆంధ్రప్రదేశ్లోకి అక్రమంగా, అనుమతి లేకుండా పెట్రోలియంను తరలించి ఇక్కడ విక్రయిస్తున్నారన్నారు.. కర్ణాటకలో ధరలు తక్కువగా ఉండటం వల్ల ఇలా చేస్తున్నారని, దీనివల్ల రాష్ట్రానికి పన్ను ఆదాయం తగ్గడమే కాకుండా సరఫరాలో అంతరాయం కలుగుతుందన్నారు.. దీనిని అరికట్టడానికి సివిల్ సప్లైస్ కమిషనర్ వారి ఆదేశాల మేరకు జాయింట్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు… సంబంధిత కమిటీలో రవాణా శాఖ, లీగల్ మెట్రాలజీ శాఖ, సివిల్ సప్లైస్ శాఖ, కమర్షియల్ టాక్స్ శాఖ లు నాలుగు విభాగాలుగా కలిసి పనిచేస్తాయన్నారు.. ఈ బృందాలు సంయుక్తంగా వారానికి రెండు సార్లు తనిఖీలు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ బృందాలను ఆదేశించారు.. లీగల్ మెట్రాలజీ వారు స్టాంపింగ్ మరియు కాలిబ్రేషన్ సరిగ్గా ఉన్నాయో లేదో చూడాలి, అలాగే సివిల్ సప్లైస్ నిబంధనల ప్రకారం వాహన రిజిస్ట్రేషన్ మరియు సంబంధిత పత్రాలను తనిఖీ చేయాలన్నారు. ఏవైనా అక్రమాలు జరిగితే కేసులు నమోదు చేయాలని జాయింట్ కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.సమావేశంలో డిటిసి శాంత కుమారి, కమర్షియల్ టాక్స్ అధికారులు, లీగల్ మెట్రాలజీ అధికారులు, ఆయిల్ కంపెనీ మేనేజర్ లు తదితరులు పాల్గొన్నారు.

