కానాలగ్రామంలో ప్రారంభమైన తి.తి.దే ధార్మిక కార్యక్రమాలు
1 min read
సంజామల, న్యూస్ నేడు: సంజామల మండలం, కానాల గ్రామంలోని శ్రీ శివరామాలయం నందు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఐదు రోజుల ధార్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం శ్రీమద్రామాయణం గురించి ఇస్కాన్ ధర్మ ప్రచారకులు నిత్య తృప్తదాస్ చేసిన ధార్మిక ప్రవచనం, స్థానిక భజన మండలి చేసిన భజన కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరించినవి. ఈ కార్యక్రమాలు శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం ధార్మిక ప్రవచనాలు మరియు స్థానిక భజన మండలిచే భజన కార్యక్రమాలు, శుక్రవారం గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మ ప్రచారమండలి సభ్యులు పులి గోవర్ధన్ రెడ్డి, భజన మండలి సభ్యులు ముడియం కృష్ణుడు, ఎద్దుల రామకృష్ణుడు, బయటపాటి తిరుపాలు, బొడ్డుమీద నాగన్న, బత్తుల బాలతిమ్మయ్య, గడ్డం రాజా, తలారి మురళి, ధన్నవాడ రామాంజనేయులు, మహానందిగారి శివరామ స్వామి, చెన్నంపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

