NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దేశ సేవకు.. యువత ముందుండాలి

1 min read

జై జవాన్​ వెల్ఫేర్​ అసోసియేషన్​ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ

–2026 క్యాలెండర్​ను ఆవిష్కరణ

కర్నూలు, న్యూస్​ నేడు: దేశానికి సేవ చేసేందుకు యువత ముందుండాలని  జై జవాన్​ వెల్ఫేర్​ అసోసియేషన్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ పిలుపునిచ్చారు. మంగళవారం జై జవాన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు గోపి చేతుల మీదుగా 2026 నూతన క్యాలెండర్​ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ దేశానికి సేవ చేసిన సైనికులు.. రిటైర్డు అయిన తరువాత సమాజానికి సేవ చేయాలని సూచించారు.  జై జవాన్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతృత్వంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలోనూ అనేక సేవా కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా వెల్ఫేర్​ అసోసియేషన్​ కర్నూలు జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ స్పష్టం చేశారు.

About Author