NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ సూర్య నారాయణ దేవాలయంను సందర్శించిన బ్రహ్మ శ్రీ వద్దిపర్తి  పద్మాకర్

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: ప్రణవపీఠ వ్యవస్థాపకులు , అభినవ శుక, పురాణ చక్రవర్తి , బ్రహ్మ శ్రీ వద్దిపర్తి  పద్మాకర్ కర్నూలు శ్రీ సూర్య నారాయణ దేవాలయమును సందర్శించారు. వారిని ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వారు విశేషముగా దత్త పీఠముతో తనకు గల అనుబంధమును వివరించారు. పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారి మరియు శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామిజీ వారి యెడల తనకు గల భక్తి భావమును, వారి ప్రేమ వాత్సల్యమును  గూర్చి వినయ పూర్వకముగా భక్తులకు వివరించారు . అనంతరం శ్రీ సూర్య దేవాలయ విశిష్టతను మరియు సూర్య ఉపాసనలను గూర్చి తెలిపినారు. సూర్య ఉపాసనకు గల పర్వదినాలను గూర్చి వివరించారు మరియు మార్కండేయ పురాణంలోని సూర్యస్తుతిని గూర్చి విశేషంగా తెలిపారు . అనంతరం  బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ ని  ఆలయ ట్రస్ట్ సభ్యులు, ఎగ్జిక్యూటివ్ ట్రస్ట్ టి శివ రామ కృష్ణ  , మరియు డా. ఆంజనేయులు  , డా. నగేష్   సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాతృ మండలి సభ్యులు , భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు .

About Author