మధర్ పేత్రా సేవలు పల్లెలకు విస్తరించాలి
1 min read

విమలా ప్రొవిన్సియల్ హౌస్ లో మదర్ పేత్రా వర్ధంతి
సుపీరియర్ సిస్టర్ శిల్పా..
నందికొట్కూరు, న్యూస్ నేడు: మదర్ పేత్రా చేసిన సేవలు పల్లెలకు విస్తరించాలని విమల ప్రొవిన్షియల్ సుపీరియర్ సిస్టర్ శిల్పా అన్నారు.కర్నూలు మండలం వెంకాయపల్లె విమల ప్రొవిన్సియల్ హౌస్ లో దీనసేవన సభ (డిఎస్ఎస్) మదర్ పేత్రా 50 వ వర్ధంతి వేడుకలను సిస్టర్ శిల్పా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కర్నూలు మేత్రాసన ఎపిస్కోపల్ వికార్ ఫాదర్ ప్రసన్నకుమార్ హాజరయ్యారు.మదర్ పేత్రా చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.మదర్ పేత్రా సేవల గురించి ఫాదర్ ప్రసన్నకుమార్ సంస్థ సిబ్బందితో అన్నారు.సంస్థ నిస్వార్థ సేవకు చేయూతనందిస్తున్న సిబ్బందిని ఆదరిస్తూ నూతన సంవత్సరంలో ఇతరులకు సేవ చేసి జీవితం ధన్యం చేయాలని సిస్టర్ శిల్పా సిబ్బందికి సూచించారు.తర్వాత సిబ్బందికి ఆటల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు.చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.ఈ కార్యక్రమంలో విమల ప్రొవి న్సియల్ పరిపాలనా సిబ్బంది సిస్టర్లు ట్రీసా,నీతూ,సారంగా,లీలావతి,దీప్తి,హౌస్ సుపీరియర్ జూలీ మరియు సిబ్బంది పాల్గొన్నారు.


