ఎం వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయి సమీక్ష సమావేశం
1 min read

హోళగుందన్యూస్ నేడు: హోళగుంద మండలలో ఎం వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎం వి ఫౌండేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ భాస్కర్ఆధ్వర్యంలో సిఆర్పిఎఫ్ (బాలల హక్కుల పరిరక్షణ కమిటీ) వాళ్లకు పిల్లలు హక్కులు, బాల కార్మికులు, బాల్య వివాహాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మండల కమిటీ కన్వీనర్‌గా కెంచప్ప, కో కన్వీనర్ గా నాగరకన్వి వెంకటేష్, దేవన్న, మండల కమిటీ గౌర అధ్యక్షులుగా హనుమంత రాయుడు, రవి లను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి యువకులు పెద్దలు మరియు ఎంవీ ఫౌండేషన్ మండల కోఆర్డినేటర్ నాయక్ ఆర్గనైజర్లు తదితరులు పాల్గొన్నారు.

