NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే నా లక్ష్యం

1 min read

జిల్లా కాంగ్రెస్ నూతన అధ్యక్షులు బి క్రాంతి నాయుడు

 కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే నా లక్ష్యం అని జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులు, న్యాయవాది బి క్రాంతి నాయుడు హామీ ఇచ్చారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష అధ్యక్షతన జరిగిన కర్నూల్ నగర కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. క్రాంతి నాయుడు మాట్లాడుతూ కర్నూలు జిల్లా నాయకులు కార్యకర్తలు అందరి సహకారంతో డిసిసి పదవి వచ్చిందని మీ అందరి సహాయక సహకారాలతో పార్టీని ముందుకు తీసుకు వెళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలానీ భాష, కోడుమూరు కోఆర్డినేటర్ అనంతరత్నం మాదిగ, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు బి బతుకన్న, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎన్సీ బజారన్న, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఏ సూర్య ప్రకాష్ రెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు షేక్ ఖాజా హుస్సేన్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బి మహేంద్ర నాయుడు, మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ కే రాఘవేందర్ రెడ్డి, ఐఎన్టీయూసీ సిటీ అధ్యక్షులు రేపల్లె ప్రతాప్, కర్నూలు మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు బి హైమావతి, కాంగ్రెస్ నాయకులు కె వెంకటరెడ్డి, జాన్ సదానందం, ఆసిఫ్ అలీ ఖాన్, కేశవరెడ్డి, ప్రభాకర్, దస్తగిరి, మహిళా కాంగ్రెస్ ఏ లలితమ్మ, సలోమి మొదలగు వారు పాల్గొన్నారు.

About Author