పీహెచ్ సీలు సిహెచ్సి ల నిర్మాణాల మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలి
1 min read
ఆసుపత్రులు అన్ని సౌకర్య సౌకర్యాలు కలిగి ప్రజలకు మంచి వైద్య సదుపాయాలు అందించాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి
కర్నూలు , న్యూస నేడు: జిల్లా లోని ప్రభుత్వ వైద్యశాల లు జాతీయ వైద్య ప్రమాణాలు కలిగి ఉండే విధంగా చేసి ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి జిల్లా వైద్యాధికారుల సమావేశం లో ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్ లో ప్రజారోగ్య సౌకర్యాలకు సంబంధించి నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ అంశంపై DMHO, DCHS తదితరులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ఆసుపత్రులలో మంచి సౌకర్యాలను ఏర్పాటు చేయడం, ప్రభుత్వ ఆసుపత్రుల విశ్వసనీయతను మెరుగుపరచడం అనే లక్ష్యంతో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాతీయ నాణ్యతా హామీ ప్రమాణాల (NQAS) సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు మేరకు జాతీయ నాణ్యత హామీ ప్రమాణాలు (NQAS) ప్రకారం జిల్లా ఆసుపత్రులలో ప్రమాణాలు పాటించే చర్యలు ఉండాలని ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశానికి డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ భాస్కర్ , డి సి హెచ్ ఎస్ డాక్టర్ జఫరుల్లా , జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ఉమా , డిస్ట్రిక్ట్ క్వాలిటీ ఆఫీసర్ ముర్తుజావలి మరియు క్వాలిటీ మేనేజర్ డాక్టర్ రూప్ కుమార్ లు పాల్గొన్నారు.

