విజయం..తథ్యం..
1 min read– మెజార్టీ కోసమే ప్రచారం
– మాజీ ఎంపీ బుట్టా రేణుక
పల్లెవెలుగు, కర్నూలు;
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే వైసీపీ అభ్యర్థులను గెలిపిస్తాయని మాజీ ఎంపీ బుట్టా రేణుక అన్నారు. శనివారం నగరంలోని 42వ వార్డు చల్లావారి వీధిలో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి వెంకటేశ్వర రెడ్డికి మద్దతుగా పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, ఇవ్వని హామీలను కూడా జగనన్న నెరవేర్చారన్నారు. అమ్మ ఒడి, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, వైస్సార్ చేయూత మొదలు వృద్ధాప్య పింఛన్.. వంటి ఎన్నో పథకాలను అమలు చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కిందన్నారు. జిల్లాలో వైసీపీ కార్పొరేట్, మున్సిపల్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నెకల్ సురేందర్, 42వ వార్డు అభ్యర్థి వెంకటేశ్వర రెడ్డి, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.