రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలి
1 min read
ప్రతి విద్యార్థి ఇంట మన భారతదేశ జాతీయ గ్రంథం అయిన భారత రాజ్యాంగం పుస్తకం ఉండాలి
రాష్ట్ర ఎస్టీ కమీషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి)
నేషనల్ ప్రెసిడెంట్ దేవరకొండ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కార్యక్రమం
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్థానిక గిరిజన భవన సమావేశ మందిరంలో ఆదివారం ఎస్టీ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ, 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు 200 మంది నిరుపేద విద్యార్థులకు విద్యా ఉపకరణాలు పంపిణీలో రాష్ట్ర ఎస్టీ కమీషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), ఏపి ఎస్టీ కమిషన్ సభ్యులు పన్నర్సు వెంకటప్ప,కాకి లక్ష్మీ సంయుక్తంగా పాల్గొన్నారు.ముందుగా డాక్టరు బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులు, స్వర్గీయ గిరిజన రత్నం సింగంపట్టాభి, స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే బడేటి కోటరామారావు (బుజ్జి), తదితర చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. విద్యార్థులకు విద్యాఉపకరణాలు, భారత రాజ్యాంగం పుస్తకాలను, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఎస్టీ ఉద్యోగులు సంఘం డైరీలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఏపీ ఎస్టీ కమీషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, విద్యకు పేదరికం అడ్డురాకూడని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న సదుపాయాలను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దేశ, రాష్ట్ర భవిషత్తు యువత చేతిలో ఉందని, ప్రతి విద్యార్థి ఇంట మనభారతదేశ జాతీయ గ్రంథం అయిన భారత రాజ్యాంగం పుస్తకం ఉండాలని అన్నారు. 200 మంది విద్యార్థులకు విద్య ఉపకారణాలకు శ్రీకారం చుట్టిన డాక్టరు దేవరకొండ వెంకటేశ్వర్లును అభినందించారు. ఎస్టీ, ఎస్సీ వర్గాలు వారికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రిజర్వేషన్స్ అనుగుణంగా నిబంధనల మేరకు సంక్షేమ, అభివృద్ది పథకాలు అమలకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. బడుగు, బలహీన వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సంక్షేమ, అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చెయ్యాలని అన్నారు.గిరిజన భవన్ ఏర్పాటుకు మా సోదరులు స్వర్గీయ బడేటి కోటరామారావు (బుజ్జి) అప్పటి జిల్లా కలెక్టరు కాటమనేని భాస్కర్ దృష్టి తీసుకువచ్చి కృషిచేశారని, 10 సంవత్సరాలు అయినను గిరిజన సోదరులు గుర్తుచేయడం నాకు ఎంతోగానో ఆనందం కలిగిందని అన్నారు. అలాగే మీరు కోరుకుంటున్న జిల్లా గిరిజన ఉద్యోగులు సంఘభవనానికి స్థల సేకరణకు కృషిచేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఏపి ఎస్టీ కమిషన్ సభ్యులు పన్నర్సు వెంకటప్ప,కాకి లక్ష్మీ, ఏయంసి చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, ట్రైబల్ వెల్ఫేరు డిప్యూటీ డైరెక్టరు పి.జగన్నాథ రావు, ట్రైబల్ స్టూడెంటు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు రాగిరి చంద్రప్ప,ఏపీ ట్రైబల్ ప్రెసిడెంటు టి.నాగేశ్వర రావు, సంఘం నేషనల్ ప్రెసిడెంటు డా:దేవరకొండ వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,ఎస్టీ సంఘాలు నాయకులు,ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు,విద్యార్థిని, విద్యార్థులు వారి కుటుంబ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

