శాస్త్రి హరినాథ్ బాబు బృందావనం పార్క్ లో సంక్రాంతిని తలపించేలా సందడి
1 min read
ఘనంగా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం
అధ్యక్ష , కార్యదర్శులుగా
మరక భుజంగారావు,పోతన మురళీకృష్ణ ,కోశాధికారి పీవీన్ దుర్గాప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఆదివారం ఉదయం 7- 30 గంటలకు జాస్తి హరినాథ్ బాబు బృందావనం పార్క్ వాకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం 201 డిస్ట్రిక్ట్ గవర్నర్ వాకర్.వడుపు గోపి ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగినది.గౌరవ అధ్యక్షులు మామిళ్ల రాఘవేంద్రరావు, ప్రెసిడెంట్ గా మరకా భుజంగరావు,కార్యదర్శిగా పోతన మురళీకృష్ణ , కోశాధికారిగా దుర్గాప్రసాద్ పివిఎన్ వి, ఉపాధ్యక్షులుగా మాడా మల్లిఖార్జునరావు, సిహెచ్ పద్మావతి దేవి,సంయుక్త కార్యదర్శులుగా పి.వి.రంగారావు, ఉక్కుర్తి రాంబాబు,జాలి వాకర్ గా ఎస్.కె.సత్యనారాయణ,గౌరవ సలహాదారుగా అడబాల లక్ష్మి , డైరెక్టర్స్ గా నూకల తిరుమలరావు,మజ్జి రాజేంద్రప్రసాద్,కె.సూర్యకాంతం,మజ్జి శ్రీనివాసరావు ఆదివారం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేసినారు. ఈ ప్రమాణ స్వీకారానికి వాకర్స్ పెద్దలు వల్లూరిపల్లి మురళీమోహన్ రావు,ఫాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్,ఐ.ఎమ్.ఆర్.మోహన్ రావు, వై.సత్యనారాయణ,జి.రామరాజు,ఆంజనేయులు, ఎస్ ఎస్ అక్బర్,తాడి నాగరాజు, మరకా శివయ్య ,సి.హెచ్. నాగేశ్వరావు మరియు 150 మంది పైగా వాకర్స్ సభ్యులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సంక్రాంతి తలపించేలా కార్యక్రమం విజయవంతం చేయడం జరిగిoది.


