NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు

1 min read

పత్తికొండ , న్యూస్​ నేడు : రైతు సంఘం నాయకుడు అప్పలరాజును వెంటనే విడుదల చేయాలి. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి. ప్రజాపక్ష నాయకుడి పై పీడీ యాక్ట్ పెట్టడం ప్రభుత్వ దాస్టికానికి నిదర్శనం. సిఐటియు మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర,ప్రజా సమస్యలపై పనిచేస్తున్న అనకాపల్లి రైతు సంఘం నాయకులు అప్పలరాజుపై పెట్టిన పీడీ యాక్ట్ వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రజా సంఘాలు సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ఆధ్వర్యంలో సోమవారం పత్తికొండ పట్టణంలోని స్థానిక ఎర్రగుడి ఈశ్వర్ రెడ్డి భవనం నుండి ర్యాలీ నిర్వహించి నాలుగు స్తంభాల కూడలి దగ్గర ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ సంఘం మండల కార్యదర్శి నరసన్న, అధ్యక్షతన వహించగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి, పీఎం పార్టీ సీనియర్ నాయకులు రంగారెడ్డి, సిఐటియు మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర, రైతు సంఘం మండల కార్యదర్శి సిద్దయ్య గౌడ్, మాట్లాడుతూ రాష్ట్ర కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగానికి విరుద్ధంగా నిరంకుశ పరిపాలన సాగిస్తుందని అన్నారు. రైతాంగ, వ్యవసాయ కార్మికుల, ప్రజా సమస్యలపై పని చేసే అప్పలరాజు పై పిడి యాక్ట్ పెట్టడం దుర్మార్గమన్నారు. రైతుల భూములు తీసుకోవద్దని, మత్స్యకారుల కడుపు కొట్టవద్దని, కూలీలకు అన్యాయం చేయవద్దని ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే నేరమా అని వారన్నారు వెంటనే అప్పలరాజును విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు గోపాల్, డివైఎఫ్ఐ నాయకులు డి. అల్లిపిర, జయప్రకాష్ గౌడ్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బుజ్జులు, శికామణి, ప్రజానాట్యమండలి మండల కార్యదర్శి రమేష్, రామాంజనేయులు, రైతు సంఘం నాయకులు రాజుల కారన్న, ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు.

About Author