వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా స్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం
1 min read

ముఖ్య అతిథులుగా హాజరైన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి …!!!
కర్నూలు, న్యూస్ నేడు: కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ…!!!వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి..వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు కమీటిలను ఏర్పాటు చేయాలి అని తెలిపారు..దీనిపై ప్రత్యేక దృష్టి సాధించాలి, పార్టీ నాయకులు ఉత్సాహం తో పని చేయాలి భాగస్వామ్యం కావాలి అన్నారు..కర్నూలు టౌన్ లో పాణ్యం వార్డులో కమీటిలను ఏర్పాటు చేస్తాం..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రెవెంత్ రెడ్డి వ్యాఖ్యలపై సీమ వాసులు స్పందించాలి… సీమ కు రావాల్సిన 44 క్యూసెక్కుల నీటిని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందించాలి సంకల్పం చేశారు.వరద నీటిని సీమ కు తరలించేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభం చేశారు.హంద్రీనీవా గాలేరు వంటివి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చారు.ఎమ్మిగనూరు ఎమ్మెల్యే వ్యాఖ్యలపై తాము ఖండిస్తున్నాం అన్నారు.. కూటమి ప్రభుత్వంలో గుండేవుల రిజర్వాయర్ ను పూర్తి చేసుకోవాలని డిమాండ్ చేస్తాం.చంద్రబాబు నాయుడు దృష్టికి ఎందుకు తీసుకొని రావడం లేదు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా గుండ్రేవుల పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం…గుండ్రేవుల రిజర్వాయర్ పై కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గా పర్యటించి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తాం.. మన సీమ కు కర్నూలు జిల్లా సాగు త్రాగు నీరు కోసం పోరాటం చేస్తాం.శ్రీశైలం జలాశయంలో డెడ్ స్టోరేజ్ ఉన్న తెలంగాణ ప్రభుత్వం నీటి తరలిస్తుంది.దీనిని పైతమ పోరాటం చేయాల్సిన సమయం వస్తుంది.సాగు నీటి ప్రాజెక్టుల పై ఒక్కసారిగా చర్చించి కలిసి పోరాటం చేస్తాం.వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి కృషి చేయాలి అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి (సమన్వయం) చల్లా మధుసూదన్ రెడ్డి , కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి , కర్నూల్ పార్లమెంట్ పరిశీలకుడు గంగుల ప్రభాకర్ రెడ్డి , నియోజకవర్గ సమన్వయకర్తలు సాయి ప్రసాద్ రెడ్డి , కంగాటి శ్రీదేవి , బుట్టా రేణుక , ఎమ్మెల్సీ మధుసూదన్ మరియు రాష్ట్ర కార్యదర్శులు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.


