ఉప్పలదడియలో సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే భూమి పూజ
1 min read
-సీఎంఆర్ఎఫ్ పంపిణీ
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : పల్లెవెలుగు మిడుతూరు (నందికొట్కూరు):నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని ఉప్పలదడియ గ్రామంలో మంగళవారం ఉదయం నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య సిమెంట్ రోడ్డుకు పూజలు చేసి భూమి పూజ చేశారు.ఉపాధి హామీ పథకం 15 లక్షల నిధులతో తారు రోడ్డు నుండి వీరన్న ఇంటి వరకు సీసీ రోడ్డు ను వేయనున్నారు.ముందుగా వీరభద్రస్వామి దేవాలయంలో ఎమ్మెల్యే పూజలు చేశారు. తర్వాత షేక్ సోఫియాబికి 63,781 రూ.ల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును వారి ఇంటికి వెళ్లి అందజేశారు. ఆటో స్టాండ్ ఏరియాలో డ్రైనేజీ కాలువను చేపట్టాలని గ్రామ నాయకులు కమతం రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి,మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి,పంచాయతీరాజ్ డిఈ సుధాకర్ బాబు,మండలకన్వీనర్ కాతా రమేష్ రెడ్డి,ఎంపీడీవో దశరథ రామయ్య, తహసిల్దార్ శ్రీనివాసులు,ఏఈలు ప్రతాప్ రెడ్డి,విశ్వనాధ్,వంగాల శివరామి రెడ్డి, రామేశ్వర్ రెడ్డి,వెంకటేశ్వర రెడ్డి,మహేశ్వర రెడ్డి,వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

