NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డ్రైనేజీ సమస్య వెంటనే పరిష్కరిస్తాం.. గ్రామ సర్పంచ్ పాల్ దినకర్

1 min read

కౌతాళం, న్యూస్ నేడు : గ్రామ పంచాయతీ ఆఫీస్ కార్యక్రమం నిర్వహించగా గ్రామ సర్పంచ్ పాల్ దినకర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం మాట్లాడుతూ కౌతాళంలో హల్వికి వెళ్లే ఆర్&బి రోడ్డు ప్రక్కన డ్రైనేజ్, వ్యవస్థ మురికి నీరు వెళ్లనివ్వకుండా 1,2,15 వార్డు ప్రజలు మురికి నీరు ఇంటి ముందు వివిధ వీధిలో  రహదారులపై మురుగు నీరు నిల్వ ఉండడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని,అలాగే ప్రధాన రహదారులైనటువంటి పేట బసవన్న  గుడి, ఆంజనేయస్వామి ఆలయం, జగద్గురు ఖాదర్ లింగ దర్గా,మసీదు  ఉన్నందు వల్ల భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సర్పంచ్  అన్నారు. ఈ విషయాన్ని మండల తహసిల్దార్,ఎంపీడీవో, ఆర్ అండ్ బి అధికారుల దృష్టికి తీసుకెళ్లడం  జరిగిందని పాల్ దినకర్ తెలిపారు. గత 30 సంవత్సరాల నుంచి మురికి నీరు అదే డ్రైనేజ్ కాలువలు వంకకు నీరు ప్రవహిస్తూ ఉండేవి. అయితే ఓ పొలం యజమాని అక్కడ కాల్వకు మట్టి వేసి అడ్డుకట్టు వేయడం వలన మురికి నీరు రోడ్డుపై ప్రవహిస్తున్నాయని తెలిపారు. రోడ్లపై మురికి నీరు నిలువ ఉండడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురి అయ్యే ప్రమాదం ఉంది, కావున అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నాం.ఈ డ్రైనేజ్ సమస్యను వివిధ శాఖలు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

About Author