NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మైనారిటీ మంత్రి  తనయులను కలిసిన టిడిపి కర్నూలు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి

1 min read

హోళగుంద న్యూస్ నేడు: మైనారిటీ మంత్రి  ఎన్ఎండి ఫారుక్  తనయులను కలిసి హొళగుంద మైనార్టీల సమస్యలను విన్నవించిన టిడిపి కర్నూలు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ బడేఘర్ అబ్దుల్ శుభాన్.ప్రజా ప్రగతి ప్రేమికులు ఆలూరు టిడిపి ఇంచార్జివర్యులు  వైకుంఠం జ్యోతి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వైకుంఠం శివప్రసాద్ ఆదేశాలతో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ మరియు న్యాయశాఖ మాత్యలు శ్రీ ఎన్.ఎం.డి ఫరూక్  దృష్టికి హొళగుంద మండలం మైనార్టీల సమస్యలను చేరవేసే సదుద్దేశంతో బుధవారం నాడు నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రివర్యులు  ఎన్.ఎం.డి ఫరూక్ తనయుడు మరియు టిడిపి నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి  ఎన్.ఎం.డి ఫిరోజ్ నీ కలిసిన  టిడిపి కర్నూలు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి బి. అబ్దుల్ సుభాన్, మైనార్టీ నాయకులు ఆదం, వైకుంఠం యువసేన ల్యాబ్ గిరి, వలి బాషా తదితరుల బృందం.టిడిపి కర్నూలు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి బి. అబ్దుల్ సుభాన్  ముఖ్యంగా హొళగుంద మండల కేంద్రంలోని ముస్లిం సమూహపు ప్రధాన సమస్య అయిన ముస్లిమ్స్ స్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణపు అవశ్యకత మరియు స్మశాన వాటికకు ప్రహరీగోడ, రక్షణ వలయం లేక అనునిత్యం పక్కనే ఉన్నటువంటి మురికినీరు, పందుల బెడద, దుర్వాసనలతో మైనారిటీ ప్రజలు పడుతున్న అష్టకష్టాలను మంత్రి ఎన్.ఎం.డి ఫరూక్ తనయలుమరియు టిడిపి నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.ఎం.డి ఫిరోజ్ కి క్షుణ్ణంగా వివరించారు.  సాధ్యమైనంత త్వరగా ఎటువంటి జాప్యం లేకుండా హొళగుంద మైనార్టీ ప్రజల దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించబోతుందని అందుకు కావలసిన అన్ని చర్యలను ప్రత్యేక శ్రద్ధతో చేపడుతామన్నారు. మరియు ఆలూరు నియోజకవర్గం తో పాటుగా హొళగుంద మండల కేంద్రంలోని మైనారిటీ సోదరులు తమ సమస్యలను వారి దృష్టికి తీసుకువస్తే వాటి సత్వర పరిష్కారానికై బాధ్యతాయుతంగా కృషి చేస్తామన్నారు.తదనంతరం కర్నూలు జిల్లా టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి బి. అబ్దుల్ సుభాన్  హొళగుంద మండలంలోని మైనార్టీ ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై వివరాలతో కూడినటువంటి వినతి పత్రాన్ని సమర్పించారు. మరియు హొళగుంద మైనారిటీ స్మశాన వాటిక ప్రహరీ గోడ విషయమై మైనార్టీ మంత్రి తనయుడు ఎన్.ఎం.డి ఫిరోజ్  సత్వరమే స్పందించిన తీరును ప్రశంసిస్తూ,హొళగుంద మండల మైనార్టీ సోదరుల పరంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు ఆదం, వైకుంఠం యువసేన యువ నాయకులు ల్యాబ్ గిరి, వలిబాష ,తదితరులు పాల్గొన్నారు.

About Author