NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలులో ఘనంగా భోగి వేడుకలు

1 min read

బోన్ ఫైర్, చిన్నారులతో రెగిపళ్ళు సంబరాలు

కర్నూలు, న్యూస్​ నేడు:  సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలులో భోగి వేడుకలను సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలో భోగి బోన్ ఫైర్ నిర్వహించడంతో పాటు రెగిపళ్ళు కార్యక్రమాన్ని నిర్వహించారు.నీయోనాటాలజిస్ట్  పీడియాట్రిషియన్ డా. సింధూర రెడ్డి , పీడియాట్రిషియన్ డా. అనుష  ఓపీడీకి వచ్చిన చిన్నారులకు రెగిపళ్ళు పంచి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమం పిల్లల ఆరోగ్యం, ఆయురారోగ్యాలు మెండుగా ఉండాలని ఆకాంక్షిస్తూ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు హెడ్ శ్రీ డా. వై. మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, పండుగలు సిబ్బందిలో ఐక్యతను, ఉత్సాహాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. పని ఒత్తిడిని తగ్గిస్తూ సానుకూల వాతావరణాన్ని సృష్టించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.ఈ భోగి వేడుకల్లో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది మరియు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని పండుగను ఆనందంగా జరుపుకున్నారు.

About Author