NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించిన వైసీపీ నాయకులు

1 min read

హోళగుంద న్యూస్ నేడు:  ఆలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బుసినే విరుపాక్షి ని శనివారం హోళగుంద మండలానికి చెందిన జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే గిరి,పలువురు యువ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే గిరి  ఆధ్వర్యంలో నాయకులు ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనుల గురించి మరియు యువత ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఎమ్మెల్యేతో చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే విరుపాక్షి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువ నాయకులు చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు, నాయకులకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చినా తను దృష్టికి తీసుకురావాలని భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో శేఖర్, తిమ్మప్ప, సిద్ధప్ప, వెంకటేష్  , గాది లింగ, రఫీ,మండల స్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author