NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నందికొట్కూర్ తెలుగు యువత అధ్యక్షులుగా దేరెడ్డి

1 min read

పార్టీపై మరింత బాధ్యత పెరిగింది..

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్​ నేడు  : నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తెలుగు యువత అధ్యక్షులుగా దేరెడ్డి వెంకటేశ్వర రెడ్డి నియమితులయ్యారు. వెంకటేశ్వర రెడ్డి మిడుతూరు మండలం పీరుసాహెబ్ పేట గ్రామానికి చెందిన వారు. ఈయన ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూన్నారు.అంతేకాక 2024 స్థానిక ఎన్నికల ప్రచార సమయంలో టిడిపి నేత మాండ్ర శివానందరెడ్డి ఎదుట మాటల తూటలతో మాట్లాడడంతో వెంకటేశ్వర రెడ్డి శివానందరెడ్డి మనసులో స్థానం సంపాదించుకున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియా పరంగా కూడా ముందుకు వెళ్తున్నారు. తెలుగు యువత అధ్యక్షులుగా నియమించినందుకు గాను శివానందరెడ్డికి మరియు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్యకు వెంకటేశ్వర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి నా వంతుగా కృషి చేస్తానని పార్టీపై మరింతగా నాపై బాధ్యత పెరిగిందని అన్నారు.

About Author