NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శివానందలహరి” పై ప్రవచన కార్యక్రమం 

1 min read

  శ్రీశైలం, న్యూస్​ నేడు:  దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమంలో    భాగంగా) ఈరోజు (19.01.2026) శ్రీ ఆముదాల మురళి శతావధాని, తిరుపతి వారిచే “శివానందలహరి” పై ప్రవచన కార్యక్రమం నిర్వహించబడుతోంది.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం 6 గంటల నుండి  ఈ  ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.రెండవ కార్యక్రమములో భాగంగా   శ్రీ శ్రీనివాస భజన సమాజము, ప్రకాశం వారిచే భజన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.   ఈ కార్యక్రమములో గణపతి ప్రార్థన, శివశివ శంకరా,  శంభో హరహర మహాదేవ, లింగాష్టకం, శ్రీశైలవాస, పార్వతి నాథుడా, శ్రీగిరి మల్లయ్య కైలాసగిరివాసా మొదలైన పలు భక్తిగీతాలను, భజనకీర్తనలను వెంకటేశ్వరరావు, పెద్ద ఆంజనేయులు, సత్యవతి, నారాయణమ్మ  తదితరులు ఆలాపించనున్నారు. కాగా   ఈ నిత్య కళారాధనలో ఆయా రోజులలో హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయబడుతున్నాయి.     శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.

About Author