విద్యార్థిని విద్యార్ధులకు ప్రభుత్వం ఆదేశాలు మేరకు పుస్తకాలు పంపిణీ
1 min read

విజయవాడ , న్యూస్ నేడు: యనమలకుదురు జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు ప్రభుత్వం అందజేస్తున్న పదవ తరగతి స్టడీ మెటీరియల్ బుక్స్(ప్రేరణ స్పూర్తి..భవితకు భరోసా)ని రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్, హెడ్ మాస్టర్ కె. శిరీష, ఎస్ ఎం సి చైర్మన్ కె. దేవి,స్టాఫ్ సెక్రెటరీ ఎన్.జోజయ్య,సీనియర్ మ్యాథ్స్ టీచర్ ఎస్.బద్రి నారాయణ ల చేతుల మీదుగా అందజేశారు.రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ విద్య పట్ల కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు చదువు కోసం అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు కూటమి ప్రభుత్వం అందజేయటం స్వాగతించదగ్గ విషయం అన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచి వారికి శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి వారికి మంచి భవిష్యత్తు కలిగే విధంగా చర్యలు తీసుకోవడం విద్యార్థుల్లో మనోధైర్యాన్ని నింపడమే అన్నారు. ముఖ్యంగా మా యువ నాయకుడు,మంత్రివర్యులు నారా లోకేష్ ప్రభుత్వ,విద్యాలయాల విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి వారికి అవసరమైన సౌకర్యాలు అందించడానికి వెనుకాడకుండా కృషి చేస్తున్నారని తెలిపారు.గత ప్రభుత్వం జగన్ రెడ్డి పాలనలో విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసి, విద్యార్థులు గంజాయి కి బానిస అయ్యేవిధంగా వారి భవిష్యత్తు నాశనానికి కారణం అయ్యాడు అన్నారు.ప్రభుత్వ పాఠశాలల స్థలాలను కూడాఅమ్ముకోవడానికి జగన్ రెడ్డి వెనకాడ లేదన్నారు. చదువు పూర్తయిన విద్యార్థులకు ఉద్యోగ కల్పన లేకుండా వారిని గాలికివదిలేసిన ఘనుడు జగన్ రెడ్డి అన్నారు. అటువంటి రాక్షసుడి పాలన పోవడం విద్యార్థులు వారి తల్లితండ్రుల అదృష్టం అన్నారు.కూటమిప్రభుత్వం,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నాయకత్వంలో చదువుకుంటున్న విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండాలనే ఆలోచనతో కొత్త కొత్త సంస్కరణలు తీసుకువచ్చి నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం చేస్తున్నారని, పాఠశాలలో పనిచేస్తున్న టీచర్స్ సహకారం ఎంతో అభినందనీయం అన్నారు. కూటమి ప్రభుత్వం ,నారా చంద్రబాబు నాయుడు ఉన్నంతవరకు పిల్లల భవిష్యత్తుకు డోకా లేదన్నారు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత మంత్రి నారా లోకేష్ తీసుకుంటారన్నారు.


