విజ్ఞాన మందిరం, విజ్ఞాన పీఠంలో సామూహిక అక్షరాభ్యాసం…
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూల్ బి క్యాంప్ లోని విజ్ఞాన మందిరం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వసంత పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ పాఠశాలలో 23-1-2026తేదీ గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా సరస్వతి ఆవాహన, పూజ, హోమములో సుమారుగా 50 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు . పూజా కార్యక్రమం తర్వాత జరిగిన సభలో పాఠశాల ఎఒ శ్రీమతి సరోజా గారు మాట్లాడుతూ 50 సంవత్సరాలకు పైగా ఈ పరిసర ప్రాంతాల్లో విద్యాపరంగా విజ్ఞాన మందిరం సేవా దృక్పథంతో ప్రారంభం చేసి ముందుకు సాగుతున్నామని, ఈ పనిలో అందరి సహకారాన్ని కోరుతున్నామని కూడా తెలియజేశారు. ఏడవ తరగతి వరకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గుర్తింపును పొంది నడుస్తున్నదని, పాఠశాలలో చక్కటి క్రమశిక్షణతో నర్సరీ నుండి ప్రారంభించి పిల్లలకు భగవద్గీతను ప్రతిరోజు నేర్పిస్తూ ,కంప్యూటర్ ఆధారత, శిశు కేంద్రిత విద్య ఆధారంగా పిల్లలలో క్రీడా స్ఫూర్తిని కూడా పెంచుతున్నామని విజ్ఞాన మందిరం కార్యదర్శి శ్రీ సత్యనారాయణ శర్మ తెలియజేశారు. అలాగే విశ్వ హిందూ పరిషత్ సేవా ప్రకల్పమైన విజ్ఞాన పీఠం లో కూడా వసంత పంచమి సందర్భంగా శ్రీ సరస్వతి మాత పూజ, అక్షరాభ్యాసం కార్యక్రమాలు జరిగాయి ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం రాష్ట్ర కో కన్వీనర్ ఏ.వి.ప్రసాద్ మాట్లాడుతూ…”సేవా ప్రోమో ధరర్మః ” అన్ని నానుడి ని పాటిస్తూ విశ్వ హిందూ పరిషత్ దేశవ్యాప్తంగా ఎన్నో సేవా కేంద్రాలను నడుపుతూ ప్రజలకు సేవచేస్తోందని తెలియజేశారు. విజ్ఞాన పీఠం కరస్పాండెంట్ మాణిక్యరెడ్డి, కోషాధికారి రంగారెడ్డి ల, శ్రీశశిధర్, చంద్రశేఖర్ రెడ్డి, గోవిందమ్మ ,ఉపేంద్ర, భాస్కర్, నగేష్, కౌశిక్ శర్మ,ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు.

