NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రెవెన్యూ ఆదాయ లక్ష్యాలను వందశాతం అధిగమించాలి

1 min read

జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి గణియా

నంద్యాల,  న్యూస్​ నేడు: జిల్లాలో ప్రధాన ఆదాయ వనరులైన ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, రిజిస్ట్రేషన్, రవాణా శాఖలకు కేటాయించిన వార్షిక ఆదాయ లక్ష్యాలను వందశాతం సాధించడమే కాకుండా అధిగమించే దిశగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఆదాయ వనరుల పెంపుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొని శాఖల వారీగా ఆదాయ సాధన పురోగతిని సమీక్షించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ  రాము నాయక్‌తో పాటు ఎక్సైజ్, మైనింగ్, వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్, రవాణా శాఖల అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆదాయం సృష్టించే శాఖల్లో వనరుల సమర్థ వినియోగం, క్షేత్రస్థాయి పర్యవేక్షణ, లక్ష్య సాధనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.రిజిస్ట్రేషన్ శాఖ విషయానికి వస్తే, రూ.202 కోట్ల లక్ష్యాన్ని మించి రూ.210 కోట్లు సాధించినట్లు అధికారులు కలెక్టర్‌కు నివేదించారు.ఆదాయం తెచ్చిపెట్టే వనరులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ, లక్ష్య సాధనలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా కట్టుదిట్టంగా పనిచేయాలని స్పష్టం చేశారు.

అలసత్వం, పన్నులు, డిఆర్​ఓ,

About Author