సౌండ్ సిస్టం అందజేసిన పూర్వపు విద్యార్థులు
1 min read

ఎంఎస్ లో ఘనంగా పాఠశాల వార్షికోత్సవ వేడుకలు..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు :నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో మంగళవారం పాఠశాల ప్రిన్సిపాల్ బీటీ శ్రీదేవి ఆధ్వర్యంలో 13వ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ఎంపీడీవో దశరథరామయ్య,టిడిపి మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి,తహసిల్దార్ శ్రీనివాసులు,మండల విద్యాశాఖ అధికారులు ఫైజున్నిసా బేగం,మల్లికార్జున నాయక్ హాజరయ్యారు. పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పిన విధంగా చదువుకొని ఒక స్థాయిలో ఉండే విధంగా మంచిగా చదువుకోవాలని అంతేకాకుండా నేటి సమాజంలో చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని వారు విద్యార్థులకు సూచించారు. ప్రిన్సిపాల్ ఆహ్వానం మేరకు వేడుకలకు విచ్చేసిన 2017-18 పదవ తరగతి పూర్వ విద్యార్థులు పాఠశాలకు 20 వేలు విలువచేసే సౌండ్ సిస్టం అందజేశారు.తర్వాత విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మమత, భాస్కర్ రెడ్డి,షర్మిల,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

