ప్రజలకు తగ్గట్టుగానే సౌకర్యాలు – ఎమ్మెల్యే
1 min read

ఏ చిన్న సమస్య తలెత్త కూడదు
అధికారులతో ఎమ్మెల్యే చరితా రెడ్డి సమీక్ష..
ఓర్వకల్లు, న్యూస్ నేడు: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి చిన్న సమస్య తలెత్తకూడదని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు.ముందుగా ఎమ్మెల్యే మరియు టిటిడి బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్ దేవాలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.తర్వాత బ్రహ్మోత్సవాల సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అధికారులు ఆలయ కమిటీ సభ్యులు మరియు కార్యకర్తలతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫిబ్రవరి 15న జరిగే రథోత్సవ కార్యక్రమం గతం కంటే ఈసారి చాలా చక్కగా శివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు ప్రతి అధికారి కృషి చేయాలని త్రాగునీరు,పారిశుధ్యం, విద్యుత్,స్త్రీ,పురుషులకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు ఉండే విధంగా చూడాలన్నారు.ఈ ప్రాంతంలో చెత్తా చెదారం లేకుండా చూడాలని కరెంటు సరఫరా కొరకు 15 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగింది అధిక సంఖ్యలో ప్రజలు వస్తున్నందున పోలీస్ సిబ్బంది అధికంగా ఉండేటట్లు చూడాలని ఎస్ఐ తో అన్నారు.అదేవిధంగా మహిళా పోలీస్ సిబ్బందిని నియమించాలని ఎమ్మెల్యే ఎస్పీతో ఫోన్ లో మాట్లాడారు.అందరి భాగస్వామ్యంతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అన్నారు.మల్లెల రాజశేఖర్ మాట్లాడుతూ కోనేరులో నీరు తగ్గకుండా నీరు పారుతూనే ఉండే విధంగా చూడాలని సౌండ్ సిస్టం ఈ ప్రాంతమంతా మైకులు ఉండాలని కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయాలన్నారు.సాంస్కృతిక కార్యక్రమాల స్టేజి దగ్గర గతంలో ఇబ్బంది పడ్డాం ఇప్పుడు ఐరన్ బ్యారీకేడ్లతో ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్సై సునీల్ కుమార్ అన్నారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ నాగిరెడ్డి,సొసైటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి,ఆలయ ఈవో మద్దిలేటి,తహసిల్దార్ విద్యాసాగర్,ఎంపీడీవో నాగ అనసూయ,విశ్వం రెడ్డి, గోవిందరెడ్డి,ఆలయ చైర్మన్ నారాయణ,కమిటీ సభ్యులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.

