NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రోళ్లపాడులో వైభవంగా రథోత్సవం

1 min read

నేడు రాష్ట్రస్థాయి ఎద్దుల బండలాగుడు పోటీలు..

మిడుతూరు, (నందికొట్కూరు)  న్యూస్ ​నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని రోళ్లపాడు గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగిన శ్రీ బరక సంజీవరాయ స్వామి రథోత్సవ కార్యక్రమం ఆలయ ధర్మకర్త పేరెడ్డి మురళీమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది.ఉదయం గణపతి పూజ,మేష లగ్న మందు శ్రీ సీతారామ కళ్యాణ సమూహూర్తం,మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ అనంతరం స్వామివారి ప్రసాదాన్ని వేలం పాట నిర్వహించినట్లు ఆలయ ధర్మకర్త తెలిపారు.రోళ్ళపాడు, అలగనూరు తదితర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై పూజలు నిర్వహించారు.అదేవిధంగా సాయంత్రం జరిగిన రథోత్సవ కార్యక్రమంలో ప్రజల అధిక సంఖ్యలో పాల్గొని రథోత్సవాన్ని తిలకించారు. రథోత్సవం సందర్భంగా ఉదయం రాష్ట్రస్థాయి నాలుగు పళ్ళ విభాగం ఎద్దుల పోటీలను ప్రారంభించారు. ఈరోజు గురువారం ఉ 8 గం.లకు రాష్ట్రస్థాయి 2 పళ్ళ ఎద్దుల ప్రదర్శన పోటీలు ప్రారంభిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త మురళీమోహన్ రెడ్డి మరియు గ్రామ సర్పంచ్ పేరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు.ఈరోజు జరిగే ఎద్దుల పోటీల్లో తొమ్మిది బహుమతులు 30 వేల నుండి 3 వేల వరకు ఉన్నాయని వారు అన్నారు.ఎలాంటి సంఘటనలు తలెత్తకుండా మిడుతూరు ఎస్సై హెచ్ ఓబులేష్ ఆధ్వర్యంలో సర్కిల్ లోని పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

About Author